|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 09:46 PM
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ పార్టీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. తెలుగుదేశం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. మార్చి 16వ తేదీన మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు రాఘవరెడ్డి కూడా టీడీపీ కండువా కప్పుకోనున్నారు. 16న సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు మాగంటి కుటుంబ సభ్యులు. కాగా, శ్రీనివాసులు రెడ్డి ఇటీవలే వైసీపీకి రాజీనామా చేశారు. మాగుంట చేరికతో టీడీపీకి మరింత బలం చేకూరుతుందని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.
Latest News