|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 09:42 PM
ముస్లీం మైనార్టీలు తెలుగుదేశం పార్టీకి దూరమవుతున్నారని.. జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదని, దీన్ని ఖండిస్తున్నానని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ముస్లీంలకు అండ.. తెలుగుదేశం జెండా’ అని సంక్షేమ పథకాలు ఆది నుంచి ఇస్తోంది టీడీపీ మాత్రమేనని కొనియాడారు. ముస్లీంలకు వైసీపీ పాలనలో ఒరిగింది శూన్యమని.. రాజకీయంగా అనేక అవకాశాలు టీడీపీ హయాంలోనే వచ్చాయన్నారు. ముస్లీంలు అత్యధికంగా ఆధారపడ్డ మోటారు రంగం కోసం.. ప్రతి చోటా ఆటోనగర్‌లు స్ధాపించింది టీడీపీ హయాంలోనేనని నజీర్ అన్నారు. తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మైనార్టీకి చెందిన తానున్నానని.. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిలో ముస్లీం మైనార్టీ ఒక్కరైనా వున్నారా? అని నజీర్ ప్రశ్నించారు.
Latest News