ఏపీలో వారికి జగన్ సర్కార్ శుభవార్త.. ఒక్కో అకౌంట్‌లోకి రూ.11,500
 

by Suryaa Desk | Wed, Mar 13, 2024, 07:51 PM

ఏపీ ప్రభుత్వం మత్స్యకారులకు శుభవార్త చెప్పింది. ONGC పైప్ లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం చొరవ తీసుకుని ONGC ద్వారా ఐదో విడతగా ఒక్కొక్కరికి నెలకు రూ. 11,500 చొప్పున 6 నెలలకుగాను రూ.69,000, మొత్తంగా రూ. 161.86 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. ఇప్పుడు అందిస్తున్న రూ.161.86 కోట్ల సాయంతో కలిపి జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం చొరవతో.. ఇప్పటివరకు ఐదు విడతల్లో అందించిన ఓఎన్జీసీ పరిహారం మొత్తం రూ. 647.44 కోట్లు.


మరోవైపు నెల్లూరు జిల్లా బోగోలు మండలం లో రూ.289 కోట్లతో నిర్మించిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ ప్రారంభించనున్నారు సీఎం జగన్. మొత్తం 25వేల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తూ నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో రూ.289 కోట్లతో నిర్మించిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బరుకు శ్రీకారం చుడతారు. మత్స్య రంగానికి వివిధ పథకాల ద్వారా ఈ 58 నెలల కాలంలో జగన్ సర్కార్ రూ. 4,913 కోట్లు అందజేసినట్లు తెలిపారు. 25వేల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చనున్న ఫిషింగ్ హార్బర్‌లో 1250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలుపుకునేందుకు అవకాశం ఉంది. ఏడాదికి 41,250 టన్నుల మేర సముద్ర మత్స్య ఉత్పత్తి చేసే ఛాన్స్ ఉంటుంది. కోల్డ్ చైన్, ఐస్ ప్లాంట్లు, చిల్ రూమ్లు వంటి మౌలిక సదుపాయాల కల్పన, బోట్ రిపేర్ వర్క్ షాపులు, గేర్ షెడ్ లు, నెట్ మెండింగ్ షెడ్ల ద్వారా మత్స్యకారులకు మరింత లబ్ధి చేకూరుతుంది.


సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారుల స్థితిగతులను మెరుగుపరిచి, వలసలను అరికట్టే లక్ష్యంతో రూ. 3,793 కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ లాండింగ్ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం.. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్టర్ ప్రారంభం.. ఇతర ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఫిషింగ్ హార్టర్ల నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. మత్య్స ఎగుమతులకు మరింత ఊతమిస్తూ ఈ 58 నెలల్లోనే సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో 4 పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.. శరవేగంగా నిర్మాణ పనులు.. పోర్టుల నిర్మాణంతో పెద్ద ఎత్తున ఉపాధి, తక్కువ రవాణా ఖర్చుతో ఎగుమతులకు అవకాశం ఉంటుంది. మత్స్యకారుల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద జగన్ సర్కార్ రూ.10వేల సాయం అందిస్తోంది. మత్స్యకారులకు వేట నిషేధం విధించిన సమయంలో ఈ సాయాన్ని అందజేస్తున్నారు. మెకనైజ్డ్, మోటరైజ్డ్‌ బోట్లతో పాటు సంప్రదాయ పడవలపై ఆధారపడి జీవించే వారికి సైతం నిషేధకాలం ముగియకుండానే భృతిని అందిస్తున్న సంగతి తెలిసిందే.

Latest News
Late Bellerin goal all but ends Real Madrid's La Liga title hopes Sat, Apr 25, 2026, 10:29 AM
Bangladesh faces deepening debt crisis Fri, Apr 24, 2026, 04:37 PM
Road to 2027 World Cup: Samson's red-hot form puts Pant's ODI spot under serious threat Fri, Apr 24, 2026, 04:36 PM
Panchayati Raj institutions a gift of Rajiv Gandhi: Congress Fri, Apr 24, 2026, 04:08 PM
TVK chief Vijay says voters crush 'political myths' with record 85 pc turnout in TN Fri, Apr 24, 2026, 04:02 PM