|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 03:39 PM
ప్రజలు గెలవాలంటే వైసీపీ ఓడి తీరాలని టీడీపి అధినేత చంద్రబాబు అన్నారు. ‘కలలకు రెక్కలు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ‘మహాశక్తి’ కింద ఐదు కార్యక్రమాలు తీసుకొస్తామన్నారు.
’మహిళలకు ఉండే అవకాశాలను గుర్తించి దీన్ని ప్రత్యేకంగా రూపొందించాం. నైపుణ్యాభివృద్ధి కోసం ఆడపిల్లలకు ఎంతైనా ఖర్చు పెట్టే పథకమిది‘ అని తెలిపారు. ‘తల్లికి వందనం’ పేరుతో ఏడాదికి రూ.15 వేలు ఇవ్వనున్నట్లు చెప్పారు.