|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 01:01 PM
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలోని కొటిపి గ్రామం కాంచనపల్లిలో వీధి కుక్కల దాడిలో జాతీయ పక్షి నెమలి బలైన సంఘటన చోటుచేసుకుంది. వివరాల మేరకు బుధవారం ఉదయం జాతీయ పక్షి నెమలి జనావాసాల్లోకి రావడంతో వీధి కుక్కలు దాడి చేసి నెమలిని హతమార్చాయి. గమనించిన స్థానికులు ఈ విషయము ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో వారు నెమలిని స్వాధీనం చేసుకొన్నారు.
Latest News