|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 11:57 AM
కొత్తవలస మండలం ఉత్తరాపల్లికి చెందిన పాలిశెట్టి సింహాచలం ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఈ నేపథ్యంలో ఆమెకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన లక్ష 90 వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మంగళవారం అందజేశారు, వైసీపీ ప్రభుత్వంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోపమ్మ, జడ్పిటిసి శ్రీదేవి, ఏఎంసీ చైర్‌మెన్ కస్తూరి తదితరులు పాల్గొన్నారు.
Latest News