|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 10:47 AM
టీడీపీ, జనసేన రాబంధుల చేతుల్లో గీతాంజలి బలి అయ్యిందని, అసలు మీరు మనుషులా..మృగాలా చంద్రబాబూ? అంటూ వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా రాబంధుల వికృత చేష్టలతో గీతాంజలి అనే బీసీ మహిళ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు చిన్నారులున్న ఒక మహిళను వీరి సోషల్‌మీడియా పొట్టన పెట్టుకుందన్నారు.
Latest News