|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 10:42 AM
బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఓఎన్జీసీ పైపులైను కారణంగా ఉపాధి కోల్పోయిన 23,459 కుటుంబాలకు ఐదో విడతగా రూ.161.86 కోట్లను సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమచేశారు. దాంతో ఇప్పటివరకూ ఐదు విడతల్లో రూ.647.44 కోట్లను సీఎం జగన్ ప్రభుత్వం మత్య్సకారుల ఖాతాల్లో జమ చేసినట్లయ్యింది. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఓఎన్జీసీ పైపులైను కారణంగా ఉపాధి కోల్పోయిన 23,459 కుటుంబాలకు ఐదో విడతగా ఒక్కొక్కరికి నెలకు రూ.11,500 చొప్పున 6నెలలకు గాను రూ.69,000, మొత్తం రూ.161.86 కోట్లను క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమచేసిన సీఎం వైయస్.జగన్. ఇప్పటివరకూ ఐదు విడతల్లో రూ.647.44 కోట్ల రూపాయలు అందజేత.
Latest News