|
|
by Suryaa Desk | Tue, Mar 12, 2024, 04:39 PM
ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమలలో హోంమంత్రి తానేటి వనిత అంగన్వాడి, ఆశా కార్యకర్తలకు ఆత్మీయ సమావేశం ఏర్పాటుచేశారు. ద్వారకా తిరుమల శేషాచల కొండ సమీపంలో నాన్ వెజ్‌తో విందు భోజనాలు ఏర్పాటు చేసి స్వయంగా హోంమంత్రి ఆ భోజనాలను వడ్డించారు. దేవస్థానం సమీపంలో నాన్ వెజ్ భోజనాలు పెట్టడంతో మంత్రి వ్యవహార శైలిపై భక్తులు మండిపడుతున్నారు. ఓటమి భయంతోనే హోంమంత్రి ప్రలోభాలకు పాల్పడుతున్నారని టీడీపీనేతలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బహిరంగంగానే అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలకు గిఫ్ట్‌లిచ్చినా.. సంబంధిత ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదనీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Latest News