|
|
by Suryaa Desk | Tue, Mar 12, 2024, 03:52 PM
కాంగ్రెస్ చెల్లెమ్మ, బీజేపీ వదినమ్మ, 420 చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్.. సీఎం వైయస్ జగన్‌ను ఏమీ చేయలేరన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు, పవన్, షర్మిల, పురందేశ్వరి తీరును ఎండగట్టారు. మోదీని నానా బూతులు తిట్టింది చంద్రబాబు కాదా?. ఈ దేశాన్ని దోచుకున్నది మోదీ అని చెప్పింది చంద్రబాబు కాదా?. పాచిపోయిన లడ్డూలిచ్చారన్నది పవన్ కాదా?. నా తల్లిని దూషించారు.. టీడీపీ అంతం చూస్తానని పవన్ ప్రగల్భాలు పలికాడు’’ అని కొడాలి నాని గుర్తు చేశారు. రాష్ట్రం ఏం విధ్వంసం అయిపోయిందని మీరంతా కలిశారు. ప్రజలకు సంక్షేమం అందిస్తున్నందుకు రాష్ట్రం నాశనమైపోయిందా?. పోర్టులు, జెట్టీలు, మెడికల్ కాలేజీలు నిర్మించినందుకు రాష్ట్రం నాశనమైపోయిందా?. రైతులకు, మహిళలకు రుణమాఫీ ఇస్తానని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. ఒకరిని ఒకరు తిట్టుకుని సిగ్గులేకుండా ఇప్పుడు అంతా కలిసి వస్తున్నారు. సీఎం జగన్‌ను ఓడించడమే అన్ని పార్టీల ఆశయం. పవన్ సిగ్గులేకుండా 21 సీట్లకు వచ్చాడు. పార్టీని పెట్టింది దేనికి అడుక్కోవడానికా?. ఈయన్ని నమ్ముకున్నవాళ్లందరికీ పవన్ ఏం చెప్తాడు. జనసేన ఓట్లు చంద్రబాబుకు బదిలీ అయ్యే పరిస్థితి లేదు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అట్టర్ ప్లాప్’’ అంటూ కొడాలి నాని దుయ్యబట్టారు.
Latest News