శ్రీశైలం ముగిసిన బ్రహ్మోత్సవాలు
 

by Suryaa Desk | Tue, Mar 12, 2024, 12:45 PM

నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఘనంగా ముగిశాయి. చివరి రోజైన నేడు భ్రమరాంబా సమేతుడైన మల్లికార్జునస్వామి అశ్వవాహనాధీశులై భక్తులకు దర్శనమిచ్చారు.ఆలయంలో ఉదయం నుంచి అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లి కార్జునస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అశ్వవాహనంలో ఆవహింపజేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విద్యుత్ దీపకాంతుల నడుమ కన్నులపండువగా ఆలయ ప్రదక్షిణలు గావించారు. ఈ పూజ కైకర్యాలలో దేవస్థానం ఈవో పెద్దిరాజు దంపతులు, భక్తులు, అధికారులు పాల్గొన్నారు. వాహన పూజలనంతరం ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలల్లో ముగింపులో భాగంగా ఆలయ ప్రాంగణం శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం జరిపించబడింది. ఈ పుష్పోత్సవంలో శ్రీ స్వామి అమ్మవార్లకు సుమారు 18 రకాల పుష్పాలు, మూడు రకాల పత్రాలతో శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషంగా అర్పించి 9 రకాల ఫలాలు నివేదించబడ్డాయి. తరువాత శ్రీస్వామి అమ్మవార్లకు ఏకాంతసేవ నిర్వహించి శయనోత్సవం జరిపించారు. ఈ శయనోత్సవానికి ఆలయ ప్రాంగణములోని శ్రీస్వామి అమ్మవార్ల శయన మందిరానికి విశేష పుష్పాలంకరణ చేసి ఏకాంతసేవ నిర్వహించారు. ఈపూజ కైకర్యాలతో ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. నేటితో ఈ ఏడాది శ్రీ స్వామి అమ్మవారికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి.

Latest News
Bengal BJP chief warns party workers against indulging in post-poll violence Tue, May 05, 2026, 04:45 PM
Pawan Kalyan hails new railway zone as transformative step for Andhra's growth Tue, May 05, 2026, 04:42 PM
IPL 2026: 'There's a lack of consistency,' says Shastri on LSG's six-match losing streak Tue, May 05, 2026, 04:41 PM
India consolidate No.1 spot in ICC Men's T20I rankings Tue, May 05, 2026, 04:30 PM
Sensex, Nifty end lower as geopolitical tensions drag markets Tue, May 05, 2026, 04:30 PM