|
|
by Suryaa Desk | Tue, Mar 12, 2024, 12:30 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు పలు సేవా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. పార్టీ ముఖ్య నేతలు పాల్గొనే ఈ కార్యక్రమాలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయి. పార్టీ మంగళవారం 14వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేంద్ర కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో సూచించింది. నియోజకవర్గాల్లో పార్టీ జెండాలు ఎగురవేయడంతో పాటు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను పూలతో అలంకరించి, సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచి్చంది. పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, జేసీఎస్ రాష్ట్ర కో ఆర్డినేటర్లు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, సమన్వయకర్తలు పార్టీ ఆవిర్భావ గొప్పతనాన్ని చాటిచెప్పాలని సూచించింది.
Latest News