|
|
by Suryaa Desk | Sat, Feb 10, 2024, 01:11 PM
ఒక్కచాన్స్ ఇవ్వండి అని ముద్దులు, నెత్తిన చేతులు పెట్టి ప్రాధేయ పడిన జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఒరగబెట్టిందేమి లేకపోగా ప్రజలనెత్తిన అప్పులు భారం పెట్టారని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆరోపించారు. ఉయ్యూరు 2వ వార్డులో శుక్రవారం టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలసి పర్య టించి బాబూ ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్ర మం నిర్వహించారు. బోడె ప్రసాద్‌కు గజమాలతో స్వాగతం పలికారు. పార్టీ నాయకులు గుర్నాధం, కుటుంబరావు, జంపాన శ్రీనివాసరావు, పైడయ్య, పడమట వెంకటేశ్వరరావు, చలపాటి శ్రీను, జరీనా బేగం, నజీర్, సుధారాణి, పలియాల శ్రీనివాసరావు, పాలడుగు బాలాజీ, మాధవి, జంపన శ్రీనివాసరావు, రంగారావు, ముప్పా రాజా, కార్తికేయ, చినకోటయ్య, అనిత, మహాలక్ష్మి, ఆదినారాయణ పాల్గొన్నారు.
Latest News