|
|
by Suryaa Desk | Sat, Feb 10, 2024, 01:07 PM
కృష్ణా జిల్లాలో గల మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వ ఆస్పత్రి పిల్లల విభాగంలో ఇంజక్షన్ వికటించి ఏడుగురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పిల్లల విభాగంలోని మొత్తం 15 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న చిన్నారులకు రోజూ మాదిరిగానే శుక్రవారం రాత్రి ఇంజక్షన్ చేశారు. ఇంజక్షన్ చేసిన అర గంట తర్వాత విపరీతమైన చలి, జ్వరం రావడాన్ని గమనించి వైద్యులు అప్రమత్తమయ్యారు. ఇంజక్షన్ చేసిన వారిలో ఏడుగురు పిల్లలకు అస్వస్థతగా ఉండడంతో వారిని ఇంటెన్సివ్ కేర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.
Latest News