|
|
by Suryaa Desk | Fri, Feb 09, 2024, 07:26 PM
చంద్రబాబు జనంలో విశ్వసనీయత కోల్పోయాడని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి విమర్శించారు. అధికారం కోసం బాబు ఎన్ని కుట్రలైనా చేస్తాడంటూ ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చని ద్రోహి చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు.
ఇప్పుడు కొత్త కొత్త హామీలతో ప్రజలను మోసం చేయడానికి వస్తున్నాడంటూ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు.