|
|
by Suryaa Desk | Fri, Feb 09, 2024, 05:32 PM
మాజీ ప్రధాని పీవీ నరసింహారావును భారతరత్నగా కేంద్రం గుర్తించడం పట్ల విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.... భారతరత్నగా పీవీని గుర్తించడం మోదీ గొప్పతనానికి నిదర్శనమని తెలిపారు. మోదీ నిర్ణయం రాజకీయాలకు అతీతంగా ఉందన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ఇలాంటి నిర్ణయాలు మోదీ ప్రభుత్వానికే సాధ్యమని చెప్పారు. అయోధ్య కోసం పోరాడిన జాతీయ నేతల్లో పీవీ ఒకరని తెలిపారు. ఈ కారణంతోనే పీవీని మోదీ ప్రభుత్వం గుర్తించిందని భావిస్తున్నానని చెప్పారు. ఈ అవార్డుకు పీవీ ఎంపిక ద్వారా భారతరత్న బిరుదుకే వన్నె వచ్చిందని తెలిపారు. దేశానికి తన మేథస్సుతో మేలు చేకూర్చిన ఘనత పీవీదని స్వరూపానందేంద్ర స్వామిపేర్కొన్నారు.
Latest News