|
|
by Suryaa Desk | Fri, Feb 09, 2024, 01:29 PM
శ్రీశైలంలో మార్చి ఒకటి నుంచి 11 వరకూ మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఇవాళ 11 గంటలకు అధికారులు సిబ్బందితో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హాజరు కర్నూలు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు చెందిన అన్ని శాఖల అధికారులు, సిబ్బంది హాజరు కానున్నారు. శ్రీశైలం మల్లన్న భక్తులకు అదనపు క్యూలైన్లు, వసతి, మంచినీరు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ఉత్సవ క్రతువులు, శౌచాలయాలు తదితర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సమీక్షించనున్నారు.
Latest News