నేటినుండి గుణదల మేరీ మాత ఉత్సవాలు
 

by Suryaa Desk | Fri, Feb 09, 2024, 01:27 PM

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుణదల మేరీ మాత ఉత్సవాలు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. శతాబ్ధి ఉత్సవాలకు సంబంధించి పోస్టర్‌ను వికర్‌ జనరల్‌ మోన్సిన్యోర్‌ మువ్వల ప్రసాద్‌ ఆవిష్కరించారు. గుణదల ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో పుణ్యక్షేత్ర గురువులు ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. మత పెద్దలు ప్రత్యేక ప్రార్ధనలు, దివ్య బలిపూజతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు పది లక్షల మంది భక్తులు వస్తారని అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు బందోబస్తుతో పాటు, ట్రాఫిక్ మళ్ళిస్తూ సీపీ ఆదేశాలు ఆదేశాలు జారీ చేశారు. గుణదల కొండ వరకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతుంది.

Latest News
India again on US priority watch list for IP rights 'violations' Fri, May 01, 2026, 12:48 PM
Hyundai Motor India, Kia India post record sales in April amid robust consumption Fri, May 01, 2026, 12:37 PM
Rajasthan Governor launches Census 2027 via self-enumeration at Lok Bhawan Fri, May 01, 2026, 12:33 PM
BJP alliance moving towards victory: Tarun Chugh amid post-poll optimism Fri, May 01, 2026, 12:22 PM
Santner sidelined for a month after scans reveal ACL shoulder injury Fri, May 01, 2026, 12:20 PM