|
|
by Suryaa Desk | Thu, Feb 08, 2024, 12:33 PM
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న సభ్యులు వీడ్కోలు సందర్భంగా సభలో ప్రసంగిస్తూ ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఓటింగ్ సమయంలో ట్రెజరీ బెంచ్ గెలుస్తుందని తెలిసినా.. మన్మోహన్ సింగ్ వీల్ చైర్‌లో వచ్చి ఓటేశారని ప్రధాని మోడీ గుర్తు చేశారు. తన విధుల పట్ల అప్రమత్తంగా ఉంటాడనడానికి ఇదొక ఉదాహరణ అని కొనియాడారు.