|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 01:49 PM
రాజకీయాల్లో ఉండే వ్యాపారవేత్తలకు వేధింపులు తగవని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. సోమవారం నాడు లోక్‌సభలో మాట్లాడుతూ... రాముడు 14 సంవత్సరాల వనవాసం తర్వాత తిరిగొచ్చినట్లు తానూ మళ్లీ రాజకీయాల్లో వస్తానని.. ఈసారి మరింత బలంగా తిరిగి వస్తానని స్పష్టం చేశారు. రాజకీయాలకు తాత్కాలికంగా మాత్రమే దూరమవుతున్నానని తెలిపారు. రాజకీయాల్లో తను కొనసాగాలనుకోక పోవడానికి ప్రధాన కారణం రెండు పడవలపై ప్రయాణించదలచుకోకపోవడమేనని.. తనకు అనేక పరిమితులు కూడా ఉన్నాయని అన్నారు. రాజకీయ ప్రక్రియలో వ్యాపారవేత్తలు చాలా ముఖ్యమైన భాగమని భావిస్తున్నానని తెలిపారు.
Latest News