దేశాభివృద్ధికి కాంగ్రెస్‌ చేసిందేమీ లేదు
 

by Suryaa Desk | Tue, Feb 06, 2024, 01:05 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడో అదృశ్యమైందని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే కార్యక్రమంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీని ఏపీ ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు. జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్‌ కనుమరుగవడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ ఉన్నంత కాలం దేశం వెనుకబాటుతో కుంగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశాభివృద్ధికి కాంగ్రెస్‌ చేసిందేమీ లేదన్నారు. కుటుంబ విషయాల్లో కాంగ్రెస్‌ జోక్యం చేసుకుంటుందని మండిపడ్డారు. 20219లో రాహుల్‌ గాంధీ అమేధిలో ఓడిపోయారని గుర్తు చేశారు. 2024లో ఎక్కడ పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమన్నారు. మిత్రపక్షాలే కాంగ్రెస్‌ను నమ్మడం లేదని, 2029 నాటికి కాంగ్రెస్‌ ముక్త భారత్‌ తథ్యమని జోస్యం చెప్పారు. 

Latest News
GCC leaders reject Iran's measures to close Strait of Hormuz Wed, Apr 29, 2026, 12:46 PM
Congress accuses Rajnath Singh of giving 'shameful clean chit' to Pak for saying terror has 'no nationality' at SCO Wed, Apr 29, 2026, 12:36 PM
UK PM Starmer not to face investigation over Mandelson issue Wed, Apr 29, 2026, 12:16 PM
Delhi excise policy case: Another AAP leader refuses to participate in court proceedings Wed, Apr 29, 2026, 12:14 PM
'Trinamool miscreants hit me on head with rod': BJP polling agent in Bengal's Nadia Wed, Apr 29, 2026, 12:10 PM