|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 01:02 PM
తల్లిని తిట్టిన వాళ్ళ పల్లకీ మోసే పవన్‌ని ఏమనాలని పేర్ని నాని ప్రశ్నించారు. జరగబోయే కురుక్షేత్రంలో పవన్ ది శల్యుడి పాత్ర అని ఎద్దేవా చేశారు. పవన్‌ని సీఎంగా చూడాలన్న కార్యకర్త స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాడని, చంద్రబాబు రిజెక్ట్ చేసి బాలశౌరిని పవన్ పక్కకు పంపాడన్నారు. నాదెండ్ల మనోహర్ కాళ్ళు పట్టుకొని బాలశౌరి జనసేనలో దూరారని దుయ్యబట్టారు. ఆశ్రయం, అధికారం, అర్హత కల్పించిన సీఎం వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత బాలశౌరికి లేదన్నారు. శక్తులన్నీ ఏకమై కౌరవుల్లా వచ్చినా వైయస్ జగన్ లాంటి అర్జునుడిని ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. కాపు కులాన్ని పణంగా పెట్టి చంద్రబాబు పల్లకీ మోయవద్దు అని హరిరామ జోగయ్య కూడా లేఖ రాశారని గుర్తుచేశారు. హుందాగా వ్యవహరించాలని పవన్ కి సూచించారు. కమ్మలు, రెడ్లు లాగే అధికారం కోసం పోరాడామని లేఖలో కోరారు. వ్యక్తిత్వ హననం చేస్తూ సీఎం వైయస్ జగన్‌ని మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తనను సర్వర్‌లా చంద్రబాబు అభివర్ణించాడని, పెత్తందారీ చంద్రబాబుకి సర్వర్లంటే అంత చిన్నచూపా అని పేర్ని నాని ప్రశ్నించారు.
Latest News