|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 12:47 PM
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సీఎం జగన్ జనంలోకి వెళ్తుంటే టీడీపీ, జనసేన షేక్ అవుతున్నాయని ఆయన అన్నారు.
ఒక్క సీటు ఇవ్వకపోయినా పవన్ చంద్రబాబును సీఎం చేయటం కోసమే పాకులాడతాడని ఆయన విమర్శించారు. 2014లో వున్న జగన్ కు ఇప్పుడున్న జగన్ కు చాలా తేడా ఉందని అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని పేర్ని నాని ధీమా వ్యక్తం చేశారు.