|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 11:35 AM
విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మకానికి ఈవోఐ జారీ చేయలేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టే సమయం, అందుకు నిర్దేశించిన ధర, విక్రయానికి సంబంధించిన నియమ నిబంధనలు,
జాయింట్ వెంచర్లలో ఆర్ఐఎన్ఎల్ వాటా వంటి అంశాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు.