|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 11:09 AM
ఏపీలో పీఎం ఆవాస్ యోజన పథకం కింద 42 శాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని కేంద్ర సహాయ మంత్రి కౌశల్ కిషోర్ తెలిపారు. రాష్ట్రానికి 21,32,432 ఇళ్లు కేటాయించగా 9,08,790 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని చెప్పారు.
వీటిలో 7,74,482 ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించినట్లు వివరించారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు.