|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 10:55 PM
విశాఖలో ఓ ఇంట్లో రోజుల తరబడి మృతదేహం ఉండడం కలకలం రేపింది. చనిపోయి రోజులైనా పొరుగు వారికి తెలియలేదు. జగదాంబకూడలి వెంకటేశ్వర థియేటర్ సమీపంలోని ఇరానీ టీ దుకాణంలో మెడిచర్ల బాబాజీ గత ఐదేళ్లుగా పని చేస్తున్నాడు. పాతనగరం చెంగలరావుపేట సమీపంలో నివాసం ఉంటున్నాడు. ఇదిలా ఉండగా వారం రోజులుగా అతను విధులకు రాకపోవడంతో దుకాణం యజమాని మరో కార్మికుడిని బాబాజీ ఇంటికి పంపించాడు.
శనివారం రాత్రి 8.30గంటల సమయంలో ఇంటికి వెళ్లి చూడగా బాబాజీ మంచంపై అచేతనంగా పడి ఉండడం గమనించాడు. సమాచారం అందుకున్న ఒకటో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడు మూడు నెలల క్రితమే ఆ ఇంట్లో అద్దెకు దిగాడని యజమాని తెలిపారు. కుటుంబ సభ్యుల వివరాలను టీ దుకాణ నిర్వాహకులకు కూడా అతను ఎప్పుడూ చెప్పలేదని పోలీసుల విచారణలో తేలింది. మద్యం తాగే అలవాటు ఉందని, గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Latest News