|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 02:42 PM
విశాఖ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 399 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ 292 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లీష్ జట్టులో క్రాలే(73) మినహా ఎవరూ అంతగా రాణించలేదు. దీంతో 69.2 ఓవర్లలో 292 పరుగులు మాత్రమే చేయగలిగింది. అటు భారత బౌలర్లలో అశ్విన్ 3, బుమ్రా 3, ముకేశ్, కుల్దీప్, అక్షర్ తలో వికెట్ తీసుకున్నారు.
విశాఖపట్నం టెస్టు ముగిసిన తర్వాత ఇంగ్లండ్ జట్టు అబుదాబికి వెళ్లనుంది. విశాఖపట్నం టెస్టు ముగిసిన వెంటనే ఇంగ్లండ్ జట్టు అబుదాబికి బయలుదేరనున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. ఫిబ్రవరి 15నుంచి రాజ్‌కోట్ వేదికగా భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ గ్యాప్ లో తమ కుటుంబ సభ్యులతో ఇంగ్లండ్ ఆటగాళ్లు అబుదాబిలో గడపనున్నారు.