నిమ్మకాయ‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
 

by Suryaa Desk | Mon, Feb 05, 2024, 12:44 PM

నిమ్మ కాయ‌ల‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజ‌నాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- నిమ్మర‌సం యాంటీసెప్టిక్‌ గా పనిచేస్తుంది.
- నిమ్మకాయల్లో కావాల్సినంత‌ సి విటమిన్ ల‌భిస్తుంది.
- నిమ్మర‌సం త‌ర‌చూ తీసుకుంటే వ‌య‌సు పెరుగుతున్నా చ‌ర్మం అంత త్వర‌గా ముడుత‌లు ప‌డ‌దు. దీంతో వృద్ధాప్య చాయ‌లు త్వర‌గా ద‌రిచేర‌వు.
- ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగాలి. అలా చేస్తే మానసిక ఒత్తిడి తగ్గి, నూతన ఉత్సాహం వ‌స్తుంది.
- నిమ్మర‌సం పంటినొప్పిని తగ్గించ‌డంలో తోడ్పడుతుంది. చిగుళ్లలోంచి ర‌క్తం వ‌చ్చేవారు త‌ర‌చూ నిమ్మర‌సం తీసుకోవ‌డంవ‌ల్ల ప్రయోజ‌నం ఉంటుంది.
- మ‌న‌ కాలేయంలో పేరుకున్న విష పదార్థాలను తొల‌గించి, శుద్ధి చేయ‌డంలో నిమ్మ‌రసం మంచి ఉప‌కారిగా ప‌నిచేస్తుంది.
- వేసవిలో నిమ్మర‌సం తాగితే అల‌స‌ట నుంచి త్వర‌గా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
- స్థూల కాయం ఉన్నవారు ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగాలి. అలా చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.
- నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను కరిగించ‌డంలో కూడా తోడ్పడుతుంది.

Latest News
SC names former CJI DY Chandrachud to resolve Kapur family trust battle Thu, May 07, 2026, 01:54 PM
TN: Vijay invited to form govt after meeting Guv at Lok Bhavan Thu, May 07, 2026, 01:47 PM
Congress high command holds key as CM race in Kerala turns into three-way battle Thu, May 07, 2026, 01:39 PM
Bihar cabinet expansion: 32 ministers take oath in NDA's grand show of strength at Gandhi Maidan Thu, May 07, 2026, 01:38 PM
One year on, Operation Sindoor continues to shape India's security doctrine Thu, May 07, 2026, 01:11 PM