|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 12:05 PM
కృష్ణా జిల్లా మైలవరం పాలిటిక్స్ గరం గరంగా మారాయి. నేడు తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రకటించారు.
మరోవైపు కృష్ణప్రసాద్ ఇప్పటికే టీడీపీలో చేరిపోయినట్లు ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు ప్రకటించడం దుమారం రేపుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే వసంత నాలుగున్నరేళ్లుగా తనకు వైసీపీ సహకరించడం లేదని క్యాడర్ ముందు వాపోయారాయన. కాగా, నేడు కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు వసంత.