బాబు అబద్ధాలంటే వారికీ ఎందుకంత నమ్మకం..?
 

by Suryaa Desk | Mon, Feb 05, 2024, 09:32 AM

అబద్ధాలు అల్లి పలకడంలో చంద్రబాబును మించినోళ్లు ప్రపంచంలో ఎవరూ లేరు అని  డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి  కొట్టు సత్యనారాయణ అన్నారు. అయన మాట్లాడుతూ.... సెల్‌ఫోన్‌ కనిపెట్టానంటాడు. ప్రపంచానికే సాంకేతిక పరిజ్ఞానం తన వల్లనే అందిందంటాడు. హైదరాబాద్‌ను పుట్టించాన టూ.. ఐటీ సృష్టికర్తనంటూ నోటికొచ్చిన అబద్ధమల్లా చెబుతుంటాడు. అలాంటి, చంద్రబాబును, ఆయన చెప్పే అబద్ధాల్ని ఈనాడు దినపత్రిక గుడ్డిగా నమ్ముతుంది. తాను నమ్మినదాన్నే ప్రజలు కూడా నమ్మాలని ఊదరగొట్టు వార్తా కథనాల్ని రాయిస్తోంది. హైదరాబాద్‌లో ఓఆర్‌ఆర్‌కు, విమానాశ్రాయానికీ చంద్రబాబుకు అసలు సంబంధం ఏంటి..? అన్నీ నేనే చేశానని చెప్పుకునే ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్ర సంపదను దోచేసిన ఘనుడ్ని కూడా నేనే అని చెప్పుకుంటే మంచిది. అలాంటి, పచ్చి అబద్ధాలకోరుకు ఈనాడు దినపత్రిక వత్తాసు పలకడం దురదృష్టకరం. ఇందుకు రామోజీరావు సిగ్గుపడాలి అని ఆగ్రహం వక్తపరిచారు. 

Latest News
Chotrani beats Abhay in World Squash Championships opener Sat, May 09, 2026, 12:58 PM
Indian seafarer killed after ship catches fire, sinks near Strait of Hormuz Sat, May 09, 2026, 12:56 PM
Emergency restoration of millennium-old temple completed in Cambodia's Angkor complex Sat, May 09, 2026, 12:56 PM
TTV Dhinakaran alleges fake support letter from his MLA; demands probe into 'horse-trading' bid by TVK Sat, May 09, 2026, 12:54 PM
TTV Dhinakaran alleges fake support letter from his MLA; demands probe into 'horse-trading' bid by TVK Sat, May 09, 2026, 12:54 PM