అందుకే ప్రభుత్వాన్ని, జడ్జిలను, న్యాయవాదులను టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు
 

by Suryaa Desk | Sun, Sep 17, 2023, 07:23 PM

చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ ను టీడీపీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నారని... అందుకే ప్రభుత్వాన్ని, జడ్జిలను, న్యాయవాదులను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. స్కిల్ డెవలప్ మెంట్ లో అవినీతికి పాల్పడినందుకే టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసిందని ఆయన అన్నారు.  తెలుగుదేశం పార్టీ రాజ్యాంగ వ్యవస్థలను అవమానిస్తోందని చెప్పారు. ఓటుకు నోటు కేసులో చిక్కిన చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్ల పాలనలో ఏపీని అప్పుల పాలు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబును ఎవరూ పట్టించుకోవడం లేదని.. చివరకు ఆయనను టీడీపీ నేతలు కూడా పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు.  ఏదో జరిగిందని చెప్పేందుకు నారా లోకేశ్ ఢిల్లీకి వెళ్లాడని... అక్కడకు వెళ్లి ఏమీ చెప్పలేకపోయాడని కాకాణి అన్నారు. చంద్రబాబును జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ఏ లాయర్లను పట్టుకుంటే బాగుంటుందనే విషయంపై లోకేశ్ చర్చలు జరుపుతున్నారని విమర్శించారు. లోకేశ్ ను కూడా అరెస్ట్ చేస్తారని ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని... ఎందుకంటే లోకేశ్ కూడా అవినీతికి పాల్పడ్డాడనే విషయం వారికి తెలుసని చెప్పారు. చంద్రబాబు చేసిన అవినీతికి 15 ఏళ్ల జైలు శిక్ష ఎప్పుడో పడాల్సిందని అన్నారు.


Latest News
Shiv Sena (UBT) calls for end to political protection of corrupt leaders Sat, May 09, 2026, 11:36 AM
Two killed in US military strike on 'drug boat' in Pacific Sat, May 09, 2026, 11:03 AM
'New dawn of trust': Nitin Nabin ahead of BJP govt formation in Bengal Sat, May 09, 2026, 10:48 AM
Messi backs Neymar for World Cup return Sat, May 09, 2026, 10:39 AM
IPL 2026: BCCI finally reacting to IPL's core principles, says founder Lalit Modi Fri, May 08, 2026, 04:44 PM