|
|
by Suryaa Desk | Sun, Sep 17, 2023, 12:31 PM
ప్రేమించిన మహిళ తనతో రానందుకు కలత చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సుధాకర్ కథనం ప్రకారం చోడవరంకి చెందిన రంజిత్ అనే యువకుడికి నర్సీపట్నంకు చెందిన ఓ వివాహితతో కొంతకాలం క్రితం పరిచయం ఏర్పడింది. దీంతో ఆమెపై ఇష్టం పెంచుకున్న రంజిత్ ఆమెను తనతో కలిసి ఉండాలని కోరగా దానికి ఆమె నిరాకరించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రంజిత్ శనివారం నర్సీపట్నంలోని ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
Latest News