సినిమాల్లో నటించేందుకు,,,రూ.12 లక్షలు పెట్టి కుక్కలాగా మారిన వ్యక్తి
 

by Suryaa Desk | Sat, Sep 16, 2023, 11:29 PM

ఓ వ్యక్తి తనకు కుక్కలపై ఉన్న ఇష్టంతో ఏకంగా కుక్క లాగా మారిపోయాడు. దానికి రూ.12 లక్షలు కూడా ఖర్చు చేశాడు. అయితే ఇది జరిగిన కొన్ని రోజులకు తనకు ఓ ఆడ కుక్క కావాలని అంటున్నాడు. వారిద్దరూ కలిసి సినిమాల్లో నటించాలని కూడా తనలో ఉన్న కోరికను బయట పెట్టాడు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్, మీమ్స్ వస్తున్నాయి. కొందరు నెటిజన్లు ఆ వ్యక్తి చేసిన పనిని శభాష్ అంటుండగా.. మరికొందరు మాత్రం ఇదేం పిచ్చిరా బాబు అనుకుంటున్నారు. జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తి ఇలా కుక్కలాగా మారిపోయాడు. తనకు కుక్కలు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమని.. అందుకే పెద్దయ్యాకు ఇలా కుక్కలాగా మారినట్లు చెప్పాడు. అయితే ఇప్పుడు అతనికి తన లాంటి మరో ఆడ కుక్క కావాలని అడుగుతున్నాడు. అలాంటి కుక్క దొరికితే ఇద్దరం కలిసి సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నట్లు వివరించాడు. తనకు ఇష్టమైన వేషంలో సినిమాల్లో యాక్టింగ్ చేయాలని భావిస్తున్నట్లు తాజాగా తన కోరికను వెల్లడించాడు. ఇప్పటివరకు టోకో కుక్కలాగా మారడం పట్ల షాక్ అవుతున్న జనాలు.. ఇప్పుడు ఆయన కోరుతున్న కోరికలు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.


అయితే మనిషి నుంచి ఇలా కుక్కలాగా మారడానికి టోకో ఏకంగా రూ.12 లక్షలు ఖర్చు పెట్టాడు. టోకో కోసం 40 రోజుల పాటు కష్టపడి.. నిపుణులు ఆయనకు సరిపోయే కుక్కలాంటి డ్రెస్‌ను తయారు చేసి ఇచ్చారు. ఇక అంత ఖర్చు చేసి కుక్క కాస్ట్యూమ్ తయారు చేయించుకున్న టోకో.. అది వేసుకుని రోడ్లపైకి వెళ్లేవాడు. సాధారణ కుక్కలు ఎలాంటి చేష్టలు చేస్తాయో అలాగే ప్రవర్తించడం ప్రారంభించాడు. భూమిపై దొర్లుతూ.. తోకను ఊపుకుంటూ రోడ్లపై ఉండే కుక్కలతో కలియతిరిగాడు. అయితే మొదట్లో తన వద్దకు సాధారణ కుక్కలు వచ్చి తనను గుర్తించి.. దూరం వెళ్లేవని ఆ తర్వాత కొన్ని రోజులకు తనతో కలిసిపోయినట్లు చెప్పాడు.


అయితే తాను ఎప్పుడూ అలా కుక్క గెటప్‌లో ఉండనని.. చాలాసార్లు కేవలం ఇంట్లోనే ఈ కుక్క కాస్ట్యూమ్‌ను వేసుకుంటానని వెల్లడించాడు. అయితే టోకోకు ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ఉండగా.. తనకు సంబంధించిన వీడియోలు అన్ని అందులో పోస్ట్ చేస్తుంటాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అయితే టోకో చేసిన ఈ పనికి సంబంధించి సోషల్ మీడియాలో పాజిటివ్‌గా, నెగిటివ్‌గా కామెంట్లు వస్తూనే ఉన్నాయి.


Latest News
Sringeri recount row: Congress alleges postal ballot tampering, vows legal fight Tue, May 05, 2026, 03:35 PM
Vietnam Prez To Lam offers prayers at Mahabodhi Temple in Bodh Gaya Tue, May 05, 2026, 03:24 PM
India, Canada kick off second round of free trade talks Tue, May 05, 2026, 03:23 PM
India, Japan commit to stronger healthcare systems, resilient supply chains Tue, May 05, 2026, 03:21 PM
'Tamil Nadu, Kerala results show strength of Indian democracy' Tue, May 05, 2026, 03:06 PM