సింహాచలం అప్పన్నకు భక్తుడి ఖరీదైన కానుక.. కేజిన్నరకుపైగా బంగారంతో ఆలయ ధ్వజస్తంభం స్వర్ణమయం
 

by Suryaa Desk | Sat, Sep 16, 2023, 09:52 PM

సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయం ధ్వజస్తంభం స్వర్ణమయం పనులు ప్రారంభమయ్యాయి. సింహగిరిపై సంప్రదాయబద్ధంగా సూర్యాస్తమయ వేళలో ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు. అనంతరం బుధవారం ధ్వజస్తంభానికి ఆ తొడుగులు అమర్చే పనులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. చెన్నైకు చెందిన సంస్థ సిబ్బంది బంగారు రేకులను ధ్వజస్తంభానికి అతికించారు. అర్చకులు తొలుత గరుడాళ్వార్‌ విగ్రహం ఎదుట విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం పూజలు జరిపారు. తర్వాత హోమం, పూర్ణాహుతి, కలశారాధన నిర్వహించి పవిత్ర జలాలతో ధ్వజస్తంభానికి సంప్రోక్షణ చేశారు. అనంతరం కళావాహన పూజలు నిర్వహించి దర్శన సేవ జరిపారు. అనంతరం పండితులు పవిత్ర జలాలతో ధ్వజ స్తంభాన్ని సంప్రోక్షణ గావించి, దర్పణ సేవ చేశారు.


విశాఖకు చెందిన సీఎంఆర్‌ సంస్థల అధినేత మావూరి వెంకటరమణ విరాళంగా అందజేసిన రూ.1.40 కోట్ల వ్యయంతో 1.800 కిలోల బంగారాన్ని వినియోగించి, ధ్వజ స్తంభానికి బంగారు రేకులను అమర్చారు. ధ్వజస్తంభానికి ఉన్న రాగి తొడుగులకు చెన్నైలోని ఓ సంస్థ ద్వారా బంగారు తాపడం చేయించారు. ఒక చదరపు అడుగు స్వర్ణ తాపడానికి ఐదు గ్రాముల చొప్పున ధ్వజ స్తంభం మొత్తానికి సుమారు 1.75 కిలోల స్వర్ణాన్ని వినియోగించారు. అప్పన్న సేవలో తరించడం అదృష్టమన్నారు సీఎంఆర్ సంస్థల అధినేత మావూరి వెంకటరమణ. స్వర్ణ తాపడం పనులు చేపట్టిన సంస్థ 25 ఏళ్ల వారంటీ ఇచ్చిందని తెలిపారు. ఈ మేరకు దీనికి సంబంధించిన ధ్రువపత్రాన్ని సింహాచలం ఆలయ ఈవో వీ త్రినాథరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకుడు రమణాచార్యులు, స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌, ట్రస్టీలు గంట్ల శ్రీనుబాబు, వారణాసి దినేశ్‌రాజ్‌, సంపంగి శ్రీనివాసరావు, పంచాడి పద్మ, శ్రీదేవి వర్మ, సాయినిర్మలు పాల్గొన్నారు.


అప్పన్న ఆలయంలో సుమారు 155 ఏళ్ల చరిత్ర కలిగిన ధ్వజ స్తంభాన్ని 2016లో తొలగించి అప్పటి అధికారులు నూతన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. అయితే ధ్వజస్తంభానికి స్వర్ణతాపడం చేసేందుకు దాత ముందుకురాగా అప్పట్లో కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేయడంతో పనులు నిలిచిపోయాయి. మళ్లీ తిరిగి ఆలయ ధ్వజస్తంభంపై ఉన్న రాగి రేకులపై స్వర్ణతాపడం చేసేందుకు ప్రస్తుత ధరల ప్రకారం సుమారు రూ.1.40 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనాలు రూపొందించి దేవదాయ శాఖ కమిషనర్ అనుమతులు తీసు కోగా.. ఆ మొత్తం ఇచ్చేందుకు సీఎంఆర్ సంస్థల అధినేత మావూరి వెంకటరమణ ముందుకొచ్చారు. ఇప్పుడు ఆ పనులన్నీ పూర్తి బంగారు తొడుగుల్ని ధ్వజస్తంభానికి అతికించారు. మొత్తానికి అప్పన్న ఆలయంలో ధ్వజస్తంభం బంగారు కాంతులతో భక్తులకు కనిపించనుంది.

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM