ఏపీలో నాలుగైదు రోజులుగా వర్షాలు
 

by Suryaa Desk | Sat, Sep 16, 2023, 09:20 PM

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం ఇప్పుడు వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా-పశ్చిమబెంగాల్ తీరాల వద్ద మరింత బలపడింది. ఇది రానున్న రెండు రోజుల్లో ఒడిశా,ఛత్తీస్‌గఢ్‌ వైపుగా కదిలి తర్వాత బలహీన పడుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా వానలు కురుస్తాయని అంచనా వేస్తోంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.


అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో 50.6 మిల్లీ మీటర్లు, పల్నాడు జిల్లా జంగమేశ్వరపురంలో 14.8, అన్నమయ్య జిల్లా చిన్నమండెంలో 11.6, బాపట్ల జిల్లా రేపల్లెలలో 11.4, అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో 10.2, కృష్ణా జిల్లా అవనిగడ్డలో 10, పల్నాడు జిల్లా అచ్చెంపేటలో 9, అల్లూరి సీతారామరాజు జిల్లా వరరామచంద్రాపూర్‌లో 9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత నాలుగైదు రోజులతో పోలిస్తే వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయనే చెప్పాలి.


అంతకముందు ఉత్తరాంధ్రతో పాటుగా కోస్తాలని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కానీ శుక్రవారం మాత్రం ఒకటి, రెండు జిల్లాలు మినహా మిగిలిచోట్ల పెద్దగా వర్షాలు పడలేదు.. అక్కడక్కడా తేలికపాటి జల్లులు మాత్రం కురిశాయి. ఇక రాయలసీమలో అయితే ఒకటి, రెండు చోట్ల మినహా పెద్దగా వానలు మాత్రం కనిపించలేదు. ఈ నెలలో వర్షాలు సరిపడా ఉంటాయని అంచనా వేసినా ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వానలు లేవనే చెప్పాలి. బంగాళాఖాతంలో మళ్లీ ఏదైనా అల్పపీడనం, ద్రోణి, ఆవర్తనం ఏర్పడితే తప్ప వర్షాలు పడేలాలేవు.

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM