|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 05:08 PM
టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పవన్ పొత్తు ప్రకటన చేయగానే సీఎం జగన్, మంత్రులు పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నారు. పొత్తు ప్రకటన తర్వాత వైసీపీ నేతలకు నిద్ర పట్టడం లేదు. పవన్‌తో టీడీపీ పొత్తు ఖరారయ్యాక వైసీపీ నేతలు పోటీకి భయపడుతున్నారు.’’ అని వ్యాఖ్యానించారు. ‘‘స్కిల్ డెవలప్‌మెంట్ ఒప్పందం ఫేక్ అగ్రిమెంట్ అని సీఎం జగన్ ఎలా అంటారు..?, మా దగ్గర అగ్రిమెంట్ కుదుర్చుకున్న డాక్యుమెంట్ ఉంది.. అవసరమైతే జగన్‌కు పంపుతాం. మేం స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించిన వివరాలన్నీ ఆధారాలతో సహా వెబ్‌సైట్ రూపొందించాం. స్కిల్ కేసులో జగన్‌తో చర్చకు సిద్దమని లోకేష్ సవాల్ విసిరారు.. సీఎం సిద్దమా.. అని ప్రశ్నించారు.
Latest News