|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 12:20 PM
తెలుగుదేశం, జనసేన పార్టీల కలయిక ఆశ్చర్యం కలిగించే విషయం కాదని వైయస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షులు, కర్నూలు నగర మేయర్ బీ.వై. రామయ్య అన్నారు. ఆది నుంచి వారిద్దరూ ఒకటే అన్నట్లుగా తాము చూశామని, అదే విషయాన్ని ప్రజలకి చెప్పామన్నారు. రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినా వ్యక్తి గురించి ఎల్లో మీడియా తెగ చర్చ పెడుతుంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. ఆయనకు ప్రజాబలం ఏముందని ప్రశ్నించారు. జనసేనకు అజెండా అంటూ ఏం లేదని, జెండా చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టడం, ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం మాత్రమే పవన్‌కు తెలుసని బి.వై. రామయ్య దుయ్యబట్టారు.
Latest News