మా అధినేత అరెస్టు కోసం విజయసాయిరెడ్డి పైరవి చేశారు
 

by Suryaa Desk | Fri, Sep 15, 2023, 05:57 PM

తమ పార్టీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం కోసం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పూణె వెళ్లి పైరవీలు చేశారని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆరోపించారు. సీమెన్స్ కేసులో చంద్రబాబు పేరు చెబితే రూ. 25 కోట్లు ఇస్తామని పూణె వెళ్లి ఆఫర్లు ఇచ్చారని పేర్కొన్నారు. అయినా సరే ఈ కేసులో అరెస్ట్ అయిన ఒక్కరు కూడా ఆయన పేరు చెప్పేందుకు నిరాకరించారని పేర్కొన్నారు.


సీఐడీ తమ 20 నెలల విచారణలో 32 మంది ఖాతాల లావాదేవీలను పరిశీలించిందని,  అయినా ఒక్క రూపాయి కూడా చంద్రబాబు ఖాతాలోకి వచ్చినట్టు నిర్ధారించలేకపోయిందని అన్నారు. జగన్ కళ్లలో ఆనందం చూడ్డానికే చంద్రబాబును అరెస్ట్ చేశారని విమర్శించారు. ఈడీ విచారణలోనూ చంద్రబాబుకు డబ్బులు వచ్చాయని ఎక్కడా నిర్ధారించలేకపోయారని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ అన్యాయమంటూ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించడంతో ఏపీ ప్రభుత్వానికి చెమటలు పట్టాయన్నారు.


Latest News
Bangladesh faces deepening debt crisis Fri, Apr 24, 2026, 04:37 PM
Road to 2027 World Cup: Samson's red-hot form puts Pant's ODI spot under serious threat Fri, Apr 24, 2026, 04:36 PM
Panchayati Raj institutions a gift of Rajiv Gandhi: Congress Fri, Apr 24, 2026, 04:08 PM
TVK chief Vijay says voters crush 'political myths' with record 85 pc turnout in TN Fri, Apr 24, 2026, 04:02 PM
Bengaluru should be Agri Tech capital like its IT hub: CM Siddaramaiah Fri, Apr 24, 2026, 03:34 PM