|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 03:44 PM
వర్తమాన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేన విస్తృతస్థాయి సమావేశాన్ని శనివారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తోపాటు, కమిటీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
Latest News