|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 02:27 PM
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామిక చర్య అని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. శ్రీకాకుళంలోని స్థానిక 80 ఫీట్ రోడ్ లోని టిడిపి జిల్లా కార్యాలయంలో చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ‘మేము సైతం బాబుకి తోడు’ అనే నినాదంతో టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. లక్ష్మీదేవి మాట్లాడుతూ నాలుగేళ్ల వైసీపీ పాలనపై ప్రజల్లో వ్యవతిరేకత పెరుగుతుందన్నారు.
Latest News