|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 01:30 PM
టిడిపి ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ శుక్రవారం చీరాల వస్తున్నట్లు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎం. ఎం కొండయ్య యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తెలుగు మహిళలు శుక్రవారం నిర్వహించే నిరసన దీక్షకు ఆమె సంఘీభావం తెలుపుతారని ఆయన చెప్పారు. టిడిపి నిరసనలపై పోలీసులు ఉక్కు పాదం మోపుతూ రోడ్లమీదకు వస్తే నేరుగా రిమాండ్ అని, ఏళ్ల తరబడి కోర్టులు చుట్టూ తిరగవలసి వస్తుందని బెదిరిస్తున్నారన్నారు.
Latest News