|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 12:06 PM
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆహ్వానం అందింది. పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు, కాణిపాకం వినాయక స్వామి ఆలయ అధికారులు తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రికను అందించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు సీఎం వైయస్ జగన్‌ను ఆహ్వానించారు స్థానిక ఎమ్మెల్యే, కాణిపాక దేవస్థానం ప్రతినిధులు. ఆహ్వనపత్రికతో పాటు వినాయక స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలు సీఎం వైయస్ జగన్‌కు అందజేశారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఈనెల 18 నుంచి అక్టోబర్ 8 వరకు 21 రోజుల పాటు చిత్తూరు జిల్లా కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సీఎంను కలిసిన వారిలో దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ అగరం మోహన్ రెడ్డి, ఈవో ఎ.వెంకటేశ్ ఉన్నారు.
Latest News