రేపు విజయనగరం జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్
 

by Suryaa Desk | Thu, Sep 14, 2023, 02:55 PM

ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 15వ తేదీ (శుక్రవారం) విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. విజయనగరం మెడికల్‌ కాలేజీ ప్రాంగణం నుంచి 5 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ (విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీ­పట్నం, నంద్యాల)లను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయనగరం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహావిష్కరణ, తర్వాత నూతన మెడికల్‌ కాలేజీ ప్రారంభోత్సవం, ల్యాబ్‌ల పరిశీలన, మిగిలిన 4 మెడికల్‌ కాలేజీల వర్చువల్‌ ప్రారంభోత్సవం తర్వాత సీఎం ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం బయలుదేరి తాడేపల్లి నివాసానికి తిరిగి చేరుకుంటారు.  

Latest News
Gunfire reported near White House; no injuries Sun, Apr 05, 2026, 06:22 PM
Passport row: Assam CM's wife to take legal action against Pawan Khera Sun, Apr 05, 2026, 06:20 PM
IPL 2026: Klaasen, Reddy lift SRH to 156/9 after early collapse against LSG Sun, Apr 05, 2026, 06:10 PM
BJP captures power in Khanapur municipality of Telangana with BRS support Sun, Apr 05, 2026, 06:07 PM
Chinese tourist's experience in Beijing reveals rapidly expanding system of identity control Sun, Apr 05, 2026, 05:38 PM