యూనివర్సిటీల్లో పోస్టుల పరిస్థితి ఏమిటి..?
 

by Suryaa Desk | Thu, Sep 14, 2023, 11:38 AM

యూనివర్సిటీల్లో టీచింగ్‌ పోస్టుల భర్తీపై సీఎం జగన్‌ ఈనెల 3న తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. 3,295 పోస్టులు యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్నాయని ఉన్నత విద్యాశాఖ అధికారులు వివరించారు. వాటి భర్తీకి 23న నోటిఫికేషన్లు జారీచేస్తామని, సెప్టెంబరు మూడు, నాలుగు వారాల్లో పరీక్షలు నిర్వహిస్తామని, అక్టోబరు 10న ఫలితాలు ప్రకటించి, నవంబరు 15లోగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తిచేస్తామని అధికారులు వివరించారు. దీనికి సీఎం జగన్‌ ఆమోదముద్ర వేశారు. కానీ నోటిఫికేషన్‌ ఇవ్వాల్సిన ఆగస్టు 23వ తేదీ దాటిపోయినా ఉన్నత విద్యా శాఖ నుంచి నోటిఫికేషన్లు మాత్రం విడుదల కాలేదు. దీంతో ఆశావహులు అసంతృప్తి కలిగివున్నారు. ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. 

Latest News
Bayern win beat Real Madrid to take advantage in UCL quarterfinal Wed, Apr 08, 2026, 10:39 AM
IPL 2026: Jaiswal's unbeaten 77 helps RR post 150/3 against MI in rain-reduced match Wed, Apr 08, 2026, 10:32 AM
BJP files complaint against Mallikarjun Kharge over 'anti-RSS' remark in Assam, demands arrest Tue, Apr 07, 2026, 04:42 PM
BJP criticises Mamata Banerjee for remark on CRPF personnel Tue, Apr 07, 2026, 04:40 PM
EAM Jaishankar meets counterpart from St Kitts and Nevis, discusses areas of cooperation Tue, Apr 07, 2026, 04:33 PM