|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 11:14 AM
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున కోర్టులో వాదనలు వినిపిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా బుధవారం రాజమహేంద్రవరానికి చేరుకొని లోకేశ్ బస చేస్తున్న నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి సాయంత్రం 3.45 గంటలకు సెంట్రల్ జైలు వద్దకు వచ్చారు. అయితే నాలుగు గంటలకు ములాఖత్ ఖరారు కావడంతో 15 నిమిషాలపాటు వేచిచూశారు. నాలుగు గంటలకు లోపలకు వెళ్లి చంద్రబాబును కలిసి 4.30 గంటల సమయంలో బయటికి వచ్చారు. బయటికి వచ్చిన అయన మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.
Latest News