|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 10:57 AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం శ్రీవారి దర్శనం కోసం 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం స్వామివారిని 75,059 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.13 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. నిన్న శ్రీవారికి 27,411 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Latest News