|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 08:59 PM
చంద్రబాబును నంద్యాల నుంచి రోడ్డుమార్గంలో విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకువెళుతున్నప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరం అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా సత్తెనపల్లిలో ఆందోళనకు దిగిన కార్యకర్తలపై డీఎస్పీ, పోలీసు అధికారులు వ్యవహరించిన తీరు దారుణమని అన్నారు. సత్తెనపల్లిలో టీడీపీ కార్యకర్త మెడపై డీఎస్పీ మోకాలితో తొక్కిపెట్టడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్తెనపల్లి డీఎస్పీని సస్పెండ్ చేసి, ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Latest News