ప్రమాదానికి గురైన బస్సు, తప్పిన పెనుప్రమాదం
 

by Suryaa Desk | Wed, Sep 13, 2023, 04:22 PM

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా,  చింతూరు మండలం మోతుగూడెం పరిధిలో విశాఖపట్నం మధురువాడ డిపో బస్సు మంగళవారం భద్రాచలం వెళుతుండగా తెల్లవారుజామున 5గంటలకు డొంకరాయి ఒడియా క్యాంపు మలుపు తిరుగుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు బోల్తా కొట్టి రోడ్డుపక్కకు పడిపోయింది. దీంతో ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్‌ తీసుకుని బయటకు వచ్చారు. ఈ బస్సులో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరందరినీ ఏపీ జెన్కో ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో టర్నింగ్‌లో బస్సు జారిపోయి ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Latest News
Calcutta HC reprimands EC over imposing restrictions on bike movement before Bengal polls Thu, Apr 23, 2026, 04:25 PM
Pakistan cannot even guarantee safe vaccination for its children: Report Thu, Apr 23, 2026, 04:23 PM
Plastic particles may trigger liver disease risk: Researchers Thu, Apr 23, 2026, 04:21 PM
Ship movement via Hormuz halts, global oil prices firm up Thu, Apr 23, 2026, 04:15 PM
Nuwan Thushara withdraws IPL NOC case against SLC Thu, Apr 23, 2026, 03:47 PM