|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 04:19 PM
ఒంగోలు నగర శివారులోని బృందావనం కల్యాణ మండపంలో ‘బాబుతోనే నేను’ పేరుతో మంగళవారం సాయంత్రం ఉమ్మడి జిల్లా స్థాయి టీడీపీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి మాట్లాడుతూ...... చంద్రబాబుపై అక్రమ కేసులు మోపి జైల్లో పెట్టడంపై రాష్ట్రంలోనేకాక దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసన వ్యక్తమవుతున్నదన్నారు. రాష్ట్ర ప్రజానీకం విషాదంలో ఉన్నారని దీనిని నిరసిస్తూ ఆందోళనలు చేసిన వారిని సైతం జగన్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టి వేధిస్తున్నదన్నారు. టీడీపీ అధినేతపై అక్రమ కేసుతో జైలులో పెట్టించి ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న కుట్రతో జగన్ ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడని దీనిని తిప్పికొట్టాలని కోరారు.
Latest News