|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 04:18 PM
సీఎం జగన్ రాష్ట్రంలో అరాచకం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్‌రాజు విమర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ..... జగన్ మాస్టర్ ప్లాన్‌తో చంద్రబాబును అరెస్టు చేయించారన్నారు. ఇటు లోకేశ్ పాదయాత్రకు అడ్డుకట్ట పడేలా, అటు కేంద్రం నిర్వహిస్తున్న జీ-20 దేశాల సదస్సు నుంచి అందరి దృష్టి మరలిపోయేలా చేశారన్నారు. జడ్జి తీర్పు కూడా ప్రజలు ఆశ్చర్యపోయేలా ఇచ్చారని, చంద్రబాబుకు రిమాండ్ ఇవ్వడంపై కూడా శాఖాపరమైన విచారణ జరగాల్సి ఉందని పేర్కొన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజును అంతం చేయాలని చూశారని, అదృషవశాత్తూ ఆయన బయటకు వచ్చారని, ఇప్పుడు చంద్రబాబును కూడా అంతం చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోందన్నారు.
Latest News